కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. రెండు రోజుల వ్యవధిలోనే ఐదు కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య ఆరుకు చేరింది. జమ్మలమడుగులోనే మూడు కేసులు ఉన్నాయి. వైరస్ సోకిన ముగ్గురు వ్యక్తులు మైలవరం మండలం దాల్మియా సిమెంట్ కర్మాగార ఉద్యోగులు.
నవాబుపేట గ్రామానికి చెందిన కొంతమంది సిమెంట్ కర్మాగారంలో పనిచేస్తుండగా వారి ద్వారా వైరస్ వ్యాప్తి చెంది ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జమ్మలమడుగు పట్టణంలో వైరస్ సోకిన వారి ఇళ్లవద్ద, వీధుల్లో.. వైద్య సిబ్బంది, మున్సిపల్, పోలీస్ శాఖ అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు.
ఇదీ చూడండి.. 'బీసీలను దేశానికి బ్యాక్ బోన్ చెయ్యడమే ప్రభుత్వ లక్ష్యం'