ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా వచ్చేవారికి అడ్డుకట్టవేసి పరీక్షలు నిర్వహించడం వల్ల కరోనా పాజిటివ్ కేసులను కట్టడి చేస్తున్నామని కడప జిల్లా రాజంపేట డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి తెలిపారు. ఈనెల 13న చెన్నై నుంచి ఉత్తరప్రదేశ్‌కు రెండు ట్రక్కుల్లో 137 మంది వలస కూలీలు రహస్యంగా తరలి వెలుతుండగా రైల్వేకోడూరు చెక్ పోస్ట్ వద్ద వారిని అడ్డుకున్నట్లు చెప్పారు.
వీరిలో కోయంబేడుతో సంబంధం ఉన్న 18 మందిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించామన్నారు. వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలిందన్నారు. అదే రోజు చెన్నై నుంచి చిట్వేలికి తమిళనాడు ప్రభుత్వ అనుమతితో ఆరుగురు రాగా... వారిని చిట్వేలి శివారు ప్రాంతంలోనే తాము అదుపులోకి తీసుకొని స్వీయ నిర్భంధంలో పెట్టమన్నారు.
అనంతరం వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒక మహిళకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు వెల్లడైందని వివరించారు. వీరిని పోలీస్ సిబ్బంది ముందుగానే అదుపులోకి తీసుకొకపోయి ఉంటే చిట్వేలి ప్రాంతానికి కరోనా ముప్పు తీవ్రంగా ఉండేదని తెలిపారు.