ETV Bharat / state

ఇక వారికి దబిడిదిబిడే - ఏపీలో 'ఈగల్' ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు - EAGLE TASK FORCE IN AP

డ్రగ్స్‌ నియంత్రణకు ఈగల్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

Eagle Task Force in AP
Eagle Task Force in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 28, 2024, 6:43 PM IST

Updated : Nov 28, 2024, 8:42 PM IST

Eagle Task Force in AP : రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణ కోసం 'ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్​ఫోర్స్​మెంట్ (ఈగల్ )ను' ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని అమరావతిలో కేంద్ర కార్యాలయం, జిల్లాల్లో యూనిట్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇందులో అమరావతిలో నార్కోటిక్ పోలీస్​స్టేషన్, 26 జిల్లాల్లో డిస్ట్రిక్ట్ నార్కోటిక్ సెల్స్ ఉన్నాయి.

గంజాయి, మత్తు పదార్థాల సరఫరా, రవాణా నియంత్రణ, నేరాల దర్యాప్తు, విచారణపై ఈగల్ ఫోర్స్​ కార్యాచరణ చేపట్టనుంది. ఇందులో పనిచేసే సిబ్బందిని డిప్యూటేషన్​పై తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. ఇందులో చేరిన యూనిఫాం సర్వీసు ఉద్యోగులకు 30 శాతం ప్రత్యేక అలవెన్స్​ ఇవ్వనున్నట్టు వివరించింది. గంజాయి, డ్రగ్స్ వ్యవహారాల్లో విచారణకు 5 ప్రత్యేక ఫాస్ట్​ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇందులో భాగంగా విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో ఫాస్ట్​ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు సంబంధించి హైకోర్టుకు నివేదించామని వెల్లడించింది. ఈగల్ ఫోర్స్​కు ముందుగా రూ.8.59 కోట్లు కేటాయిస్తూ హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఆదేశాలు జారీ చేశారు.

డ్రగ్స్​ నెట్​వర్క్​ని ధ్వంసం చేసేలా కార్యాచరణ : గంజాయి సాగు, ఉత్పత్తి, రవాణా, స్మగ్లింగ్, విక్రయం, కొనుగోలు, సేవనం లాంటి అంశాల్లో కఠినంగా వ్యవహరించేలా దీనికి ప్రత్యేకంగా బాధ్యతల్ని అప్పగిస్తూ హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో పాటు రాష్ట్రంలో మత్తు పదార్థాలు, సింథటిక్ డ్రగ్స్ స్మగ్లింగ్​ను ఉక్కుపాదంతో అణచివేయాలని ఆదేశించింది. ఏపీలో ప్రజారోగ్యాన్ని కాపాడేలా మాదకద్రవ్యాల నెట్​వర్క్​ని ధ్వంసం చేసేలా కార్యాచరణ, దర్యాప్తు ఉండాలని ఈగల్​కి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. గతంలో సీఐడీ నార్కోటిక్స్ సెల్ ఆధీనంలో ఉన్న ఈ అధికారాలను వీటికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

AP EAGLE to Fight Drugs : అదనపు డీజీ లేదా ఐజీ స్థాయి నేతృత్వంలో ఈగల్​ పనిచేయనుంది. ఒక ఎస్పీ, అదనపు ఎస్పీలు, డీఎస్పీలతో పాటు 459 మంది సిబ్బందిని కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మరోవైపు స్థానిక పోలీసులతో కలిసి రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ కేసుల్ని నమోదు చేయడంతో పాటు దర్యాప్తు కూడా ఈగల్ ఫోర్స్​ చేస్తుందని వెల్లడించింది. ఈ ఫోర్స్​కి నేతృత్వం వహించే అధికారి నార్కోటిక్స్ కోఆర్డినేషన్ సెంటర్​కి అధిపతిగా ఉంటారని వివరించింది.

రాష్ట్రవ్యాప్తంగా పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, జీఆర్పీ, ఇతర పోలీసు యూనిట్లు ఈగల్ టాస్క్​ఫోర్స్​కు కేసుల నమోదు, దర్యాప్తులో సహకరించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ అనుమతితో దేశంలో ఎక్కడికైనా వెళ్లి కేసు దర్యాప్తు చేసేందుకు అవకాశం కల్పించింది. అమరావతిలో 66 మందితో రాష్ట్రస్థాయి టాస్క్​ఫోర్స్​, విశాఖ, పాడేరులో​ డీఎస్పీ స్థాయి అధికారులను నియమించనున్నట్టు తెలిపింది. దీంతో పాటు 24 గంటలూ పనిచేసే సెంట్రల్ కంట్రోల్ రూమ్ కూడా ఈగల్ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేస్తామని వివరించింది. అలాగే ప్రజలు సమాచారం, ఫిర్యాదులు చేసేందుకు 1972 కాల్​సెంటర్ పనిచేస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.

గంజాయి అడ్డుకట్టకు 'ఈగల్' - 1972టోల్​ ఫ్రీ నంబర్ ఆవిష్కరించనున్న సీఎం : హోంమంత్రి అనిత

అక్రమ మద్యం నియంత్రణ, డ్రగ్స్ బాధితుల పునరావాసంపై మంత్రుల కమిటీ

Last Updated : Nov 28, 2024, 8:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.