ETV Bharat / state

అధికారి ఇంట్లో ముగ్గురికి కరోనా పాజిటివ్​ - కడప జిల్లాలో ఓకే కుటుంబంలో ముగ్గురికి కరోనా

ఓ అధికారి ఇంట్లో ముగ్గురికి కరోనా వైరస్​ సోకింది. సుండుపల్లిలో మండల స్థాయి అధికారి కుమారుడు... ఫాతిమా మెడికల్​ కళాశాలలో కొవిడ్​ విధులు నిర్వహించారు. వైద్యపరీక్షల్లో కుమారుడికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో అతని కుటుంబ సభ్యులకు పరీక్షలు జరపగా... తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ ఘటన కడప జిల్లా రాయచోటిలోని సుండుపల్లిలో జరిగింది.

corona affected to family in kadapa district rayachoti constituency
రాయచోటి నియోజకవర్గంలో అప్రమత్తమైన అధికారులు
author img

By

Published : Jun 29, 2020, 12:54 PM IST

కడప జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రోజురోజుకూ కరోనా పాజిటివ్​ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కరోనా విధులు నిర్వహిస్తోన్న అధికారులకు వైరస్​ సోకింది. సుండుపల్లిలో మండల స్థాయి అధికారికి కరోనా పాజిటివ్​గా​ నిర్ధారణ అయ్యింది.

ఆయన కుమారుడు కడప ఫాతిమా మెడికల్ కళాశాలలో కోవిడ్ విధులు నిర్వహించారు. వైద్య పరీక్షల్లో అతనికి కొవిడ్​ వచ్చినట్లు తేలింది. ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వారికీ వైరస్​ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. వారం రోజులుగా అధికారి సంచరించిన ప్రదేశాలు, ఆయనకు సన్నిహితంగా ఉన్న వ్యక్తులను, అధికారులందరినీ క్వారంటైన్​కు తరలించారు.

ఇదీ చదవండి:

కడప జిల్లాలో కరోనా విజృంభణ...పులివెందులలో 53 కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.