మాజీ మంత్రి వివేకా హత్య కేసులో 12 మంది అనుమానితులను దిల్లీ కేంద్రంగా దాదాపు 2 నెలలు విచారించిన సీబీఐ..మలివిడతగా కడపలో విచారణ వేగవంతం చేస్తోంది. 2019 మార్చి 8 నుంచి ఏప్రిల్ 28 వరకూ వివేకా ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డి, వాచ్‌మెన్ రంగన్న, పీఏ కృష్ణారెడ్డి సహా 12 మందిని దిల్లీలోని లాడ్జీల్లో ఉంచుతూ వేర్వేరుగా సీబీఐ విచారించినట్టు సమాచారం. మాజీ డ్రైవర్ దస్తగిరి నుంచి కీలక సమాచారం సేకరించినట్టు తెలిసింది.
ఈ నెల 7 నుంచి కడపలో విచారణ మొదలుపెట్టిన అధికారులు.. దస్తగిరితో పాటు కంప్యూటర్ ఆపరేటర్ హిదాయతుల్లాను ప్రశ్నిస్తోంది. హత్య జరిగిన రోజున హిదాయతుల్లా మృతదేహం ఫొటోలు తీశాడన్న కారణంతో ఆ కోణంలో విచారిస్తోంది. వీరిద్దరితో పాటు వైకాపా కార్యకర్త కిరణ్ కుమార్ యాదవ్‌నూ విచారించింది. హత్యకు 15 రోజుల ముందు వివేకాతో ఫోన్‌లో మాట్లాడి, కలిసినట్టు సీబీఐ అనుమానిస్తోంది. ఇవాళ మరికొందరు అనుమానితులను ప్రశ్నించే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి:
మిరప సాగుపై రైతుల్లో ఆసక్తి.. విత్తన ధరలు పెంచి కంపెనీల దోపిడీ!