వివేకా హత్య కేసు విషయమై హైకోర్టులో సీబీఐ వేసిన అనుబంధ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి.. అనుబంధ పిటిషన్ ప్రతిని పిటిషనర్ల తరఫు న్యాయవాదికి అందజేయాలని సూచిస్తూ విచారణ వాయిదా వేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో సంబంధిత రికార్డులన్నీ ఇవ్వాలని పులివెందుల మేజిస్ట్రేట్‌ను సీబీఐ కోరింది. ఈ అభ్యర్థనను మేజిస్ట్రేట్ తిరస్కరించింది. ఈ కారణంగా హైకోర్టును సీబీఐ ఆశ్రయించింది.
ఇదీ చదవండి: సీఎం.. సలహాదారుల చర్య కోర్టు ధిక్కరణే..! కానీ..