కడపలో ఎక్కువ ధ్వని కాలుష్యం చేస్తున్న బుల్లెట్ వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఏకంగా.. 150 వాహనాలను కడప ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తరలించారు. నిబంధనల ప్రకారం బుల్లెట్ వాహనాలకు వస్తున్న సైలెన్సర్ తొలగించి.. వాటి స్థానంలో ఎక్కువ శబ్దం వచ్చే సైలెన్సర్లను ఏర్పాటు చేసుకొని నగరంలో తిరుగుతున్న వారి వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులతో డీఎస్పీ సునీల్ ఈ మేరకు చర్యలు చేపట్టారు. తీరు మార్చుకోకుంటే.. మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. సైలెన్సర్లు మార్చుకోవాలని ఆదేశించారు.
ఇవీ చూడండి: