పాఠశాల మరుగుదొడ్డి నీటిగుంతలో పడి ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు. గుంత పూడ్చకపోవడమే విషాదానికి కారణమైంది. అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టే ఈ సంఘటన కడప జిల్లా రామాపురం మండలంలోని నీలకంఠరావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.
నాడు-నేడు కింద పాఠశాల ఆవరణలో గుత్తేదారు 8 అడుగుల లోతు గుంత తీశారు. వర్షాలు కురుస్తుండడంతో పనులు ఆపివేశారు. గుంతలోకి నీరు వచ్చి చేరింది. పాఠశాలలో ఆట స్థలం ఉండడంతో పొరుగింటి పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా ఏడేళ్ల రెండవ తరగతి విద్యార్థి ఆయున్ ప్రమాదవశాత్తు గుంతలో పడి మృతి చెందాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ ఇక లేడని తెలిసి.. తల్లి ఆసిిఫా రోదనలు మిన్నంటాయి.
ఇవీ చదవండి: