ETV Bharat / state

ఇసుక అక్రమ రవాణాపై భాజపా నిరసన

రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ నేతలు శుక్రవారం కడప జిల్లా రాయచోటి లో నిరసన కార్యక్రమం చేపట్టారు.

bjp protest against sand trafficking
ఇసుక అక్రమ రవాణాపై భాజపా నిరసన
author img

By

Published : Jun 13, 2020, 11:47 AM IST

రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ నేతలు శుక్రవారం కడప జిల్లా రాయచోటి లో నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు రాయచోటి పట్టణం మాసాపేట మార్కెట్ యార్డ్ లోని ఇసుక డంప్ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇసుకాసురులను రక్షిస్తున్న ప్రభుత్వం గద్దె దిగాలని డిమాండ్ చేశారు.

ఇసుక సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయిందని ఆరోపించారు. నిర్మాణ రంగం కూడా కుదేలయిందన్నారు. కూలీలు, కార్మికులకు పనులు లేక అవస్థలు పడుతున్నారని ఇలాంటి సమయంలో ఇసుక అందుబాటులో లేకుండా అధికార పార్టీ నేతలు అక్రమ మార్గాల్లో తరలిస్తున్నారని భాజపా జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు శివ గంగ రెడ్డి విమర్శించారు‌.

కార్యక్రమంలో బీజేపీ నాయకులు జల్లా శ్రీనివాసులు, ఆనందగజపతి రాజు, రమణ యాదవ్, గుండ్ల పల్లి వెంకటేష్, బాలాజీ యాదవ్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి: 'తుపాన్లను ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.