రాయలసీమకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందంటున్న భారతీయ జనతా పార్టీ... సీమలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలనే డిమాండుతో నేడు కడపలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. కడప నగరంలోని బిల్టప్ సర్కిల్ వద్ద రాయలసీమ రణభేరి పేరుతో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈసభకు ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మాజీమంత్రి పురంధేశ్వరి హాజరవుతున్నట్లు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తెలిపారు.
బహిరంగ సభ కోసం ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. రాయలసీమ జిల్లాల నుంచి భాజపా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా.. సీమకు ఎలాంటి లాభం చేకూర్చలేదని, రాయలసీమలో నెలకొన్న అన్ని సమస్యలపై గళమెత్తేందుకు సభ నిర్వహిస్తున్నామని భాజపా నేతలు తెలిపారు. అభివృద్ధి నినాదంతో ముందుకు వెళ్తున్న కేంద్రంలో భాజపా ప్రభుత్వం... అవినీతిలో కూరుకుపోయిన రాష్ట్ర ప్రభుత్వ వ్యత్యాసాలను ప్రజలకు తెలియ జేసేందుకు ఈ సభను ఎంచుకున్నామని ఆయన వెల్లడించారు. నేటి సభ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబఏర్పాస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీ చదవండి : Pawan: 'ప్రజల కోసం పాలిస్తున్నట్లు ఏ మూలాన కనిపించట్లేదు'