కడప జిల్లా(kadapa district) బద్వేలు (Badwel by poll)లో.. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ప్రయత్నించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు(Somu Veerraju) ఆరోపించారు. బద్వేలులోని భాజపా కార్యాలయంలో నేతలు సోము వీర్రాజు, ఎంపీ సీఎం రమేష్, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కలిసి మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో నేతలు హుందాగా ఉండాలని హితవు పలికారు. తమ పార్టీకి చెందిన కలసపాడు అధ్యక్షున్ని బలవంతగా తీసుకెళ్లి.. వైకాపా కండుపా కప్పారని సోమూ మండిపడ్డారు.
బద్వేలు ప్రజలు 40 ఏళ్లుగా వైఎస్ కుటుంబానికి పట్టం కడుతున్నా.. కనీసం ప్రభుత్వ డిగ్రీ కాలేజి కూడా లేదని నేతలు విమర్శించారు. బద్వేలులో అభివృద్ధి కేంద్ర నిధులతోనే జరిగింది తప్ప.. రాష్ట్ర ప్రభుత్వం నిధులతో కాదన్నారు. వైకాపా ఓట్లు వేయకపోతే ప్రభుత్వ పథకాలను రద్దు చేస్తామని వైకాపా నాయకులు బెదిరిస్తున్నారని ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు.
బద్వేలులో.. వైకాపా ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి, రమణా రెడ్డి, రాజగోపాల్ రెడ్డి భూ కబ్జాల పర్వం కొనసాగుతోందని భాజపా నేతలు ఆరోపించారు. భాజపా నాయకుల ఫిర్యాదు మేరకు.. బద్వేల్ ఉప ఎన్నికల నిర్వహణకు కేంద్ర పారా మిలటరీ బలగాలు రంగంలోకి దిగాయని, ప్రజలు ఎవరూ భయపడాల్సిన పని లేదని, నిర్భయంగా ఓటేయాలని నేతలు పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి