కడప జిల్లాలోని బద్వేలు సబ్‌జైలులో ఖైదీలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఈ జైలుకు నిత్యం 40 మంది ఖైదీలు వస్తుండగా..అరకొర సౌకర్యాలు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. చాలా రోజులుగా ఖైదీలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుద్ధ జల కర్మాగారం పని చేయటం లేదని జైలులో శిక్ష అనుభవించిన ఖైదీలు అంటున్నారు. అయితే జైలులో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని...ఎవైనా సమస్యలుంటే ఉన్నాతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని జైలు అధికారి స్పష్టం చేశారు.
ఇదీచదవండి