కడప జిల్లా బద్వేలు శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ ప్రక్రియ ఉదయం7 గంటలకు ప్రారంభం కాగా.. సాయంత్రం 5 గంటల వరకు 59.58 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ వెబ్ కాస్టింగ్ ద్వారా బద్వేల్ ఉపఎన్నికను పరిశీలిస్తున్నారు. 281 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రశాంతంగా సాగుతోందని.. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని విజయానంద్ వెల్లడించారు.
ఉదయం ఆరు గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వృద్ధులు, యువకులు అత్యంత ఉత్సాహంతో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుతున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు.
Video Call: తనను తీసుకెళ్లడం లేదని... భర్తకు వీడియో కాల్ చేసి..