దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేద వైద్యం చక్కగా పని చేస్తుందని ప్రభుత్వ ఆయుర్వేద వైద్య నిపుణులు షఫీ అన్నారు. కడప జిల్లా బద్వేలు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో ఆయన అదనపు బాధ్యతలు చేపట్టారు. మధుమేహం, రక్తపోటు, కీళ్ల నొప్పులు తదితర దీర్ఘకాలిక వ్యాధులకు మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్భవ పథకం కింద ఆయుర్వేద వైద్యశాలను ఎంపిక చేసి అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. వాటిలో రాయలసీమలోని కడప రిమ్స్ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల, చిత్తూరు జిల్లాలోని కుప్పం ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల మొదటి దిశగా ఎంపికైనట్లు వివరించారు. ఈ ఆసుపత్రుల్లో పంచకర్మ వైద్య చికిత్స విధానం, యోగా కేంద్రాలను నిర్మించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి బోధించే వారిని నియమించనున్నట్లు తెలిపారు. రెండో దశలో బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు వైద్యశాలలను ఎంపిక చేసే అవకాశం ఉందన్నారు.
ఇదీ చదవండి.. "ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లకు పింఛన్ ఇవ్వాలి"