ETV Bharat / state

సమస్యలు పరిష్కరించాలంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల ఆందోళన

Asha workers Strike To Demand solve Problems In Government:ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలంటూ ఏఐటీయూసీ నాయకులు కడప కలెక్టరేట్ ముందు సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. చేతిలో ప్లకార్డులు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కడప, అనంతపురం, నంద్యాల జిల్లా కలక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు

Asha workers Strike To Demand solve Problems In Government

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 7, 2023, 10:23 PM IST

ఆశా కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ ఏఐటీయుసీ నాయకుల డిమాండ్

Asha workers Strike To Demand solve Problems In Government: ఆశా కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి నెలకు 26వేల రూపాయలు వేతనం ఇవ్వాలని, ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కడప కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ (AITUC) ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. ఆశా కార్యకర్తలపై పెంచిన పని ఒత్తిడిని తగ్గించాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. చేతిలో ప్లకార్డులు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు 26వేల రూపాయలు జీతం అధికారంలోకి రాగానే పెంచుతానని భరోసా ఇచ్చారు.

ఆశా కార్యకర్తల సమస్యలపై అన్ని జిల్లాల్లో ఉద్యమాలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆశా వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వకుండా వారితో అన్ని పనులు చేయించుకుంటున్నారు. వారికి కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలి. పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు ఏమి లేవు. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం మరింత తీవ్రంగా ఉంటుంది :- వెంకటసుబ్బయ్య, ఏఐటీయుసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు.

Asha Workers Demand To Recognized As Government Employees: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు అయినా జీతాలు పెంచలేదంటూ ఆశా వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆశా కార్యకర్తలు ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినప్పటికీ వారికి ఎలాంటి ప్రభుత్వ పథకాలు వర్తింప చేయడం లేదని వెంకటసుబ్బయ్య అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అయితే కనీసం పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు ఉండేవని అవి ఏమి లేకపోగా జీతాలు పెంచట్లేదని ఆయన పేర్కొన్నారు. అనేక కొత్త యాప్​లతో పని ఒత్తిడి పెంచుతున్నారని ఆశా కార్యకర్తలు తెలిపారు. కనీసం తమ సమస్యలను చెప్పుకునేందుకు కూడా అధికారులు అనుమతించడం లేదని వాపోతున్నారు. ధర్నాలకు వెళ్తే ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తామనడం దారుణమంటున్నారు. రిటైర్డ్ అయిన ఆశా వర్కర్లకు ఐదు లక్షల రూపాయలు పారితోషికం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలానే ప్రతి నెల 10వేల రూపాయలు పింఛన్ ఇవ్వాలని పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించకుంటే తెలంగాణ ప్రభుత్వానికి పట్టిన గతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పడుతుందని హెచ్చరించారు.

మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలి. ఆశా వర్కర్లకు 26వేల రూపాయల జీతం ఇవ్వాలి. పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ కింద 5లక్షల రూపాయలు ఇవ్వాలి. రిటైర్మెంట్ చేశాక సగం జీతం చెల్లించాలి. పని భారం, ఒత్తిడి తగ్గించాలి. మా సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి. :-శాంతమ్మ, ఆశా వర్కర్.

Strike In AITUC Union In Ananthapur: అనంతపురంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఆశా కార్యకర్తలకు కనీస వేతనం అమలు చేయాలని వారు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశ వర్కర్లతో అన్ని పనులు చేయించుకుంటున్నా శాశ్వత ఉద్యోగులుగా గుర్తించడంలో నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. కలెక్టరేట్ ముట్టడి చేపట్టిన ఆశా కార్యకర్తలను, ఏఐటీయూసీ నాయకులను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు.

నెల్లూరులో సమస్యలపై గళమెత్తిన పారిశుద్ధ్య కార్మికులు - పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత

Asha Workers Strike In Nandyal: నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లకు ఇరవై వేల రూపాయల కనీస వేతనం ఇవ్వాలని ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. హామీలు నెరవేర్చక పోతే ఆందోళన ఉద్ధృతంగా ఉంటుందని తెలిపారు.

నెల్లూరు కలెక్టరేట్​ దగ్గర ఎస్​ఎఫ్​ఐ ఆందోళన - గేట్లు దూకి లోపలికి వెళ్లేందుకు యత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.