కడప జిల్లా పులివెందుల వెంకటాపురం సమీపంలో రింగ్ రోడ్డు సమీపంలో ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. వాహనంలో షరీఫ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా... ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్కు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.
పులివెందులలో కారు బోల్తా... ఒకరు మృతి - latest accident in pulivenula
మితిమీరిన వేగం...దాని ఫలితంగా ఒక కుటుంబం ఇంటి యజమానిని కోల్పోయింది. కడప జిల్లా పులివెందుల వెంకటాపురం సమీపంలోని రింగ్ రోడ్ లో అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఒకరు చనిపోగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
పులివెందులలో కారు బోల్తా... ఒకరు మృతి
కడప జిల్లా పులివెందుల వెంకటాపురం సమీపంలో రింగ్ రోడ్డు సమీపంలో ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. వాహనంలో షరీఫ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా... ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్కు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.
AP_CDP_51_22_ACEDENT_av_AP10042
REPORTER:-M.MaruthiPrasad
CENTER:-Pulivendula
మితిమీరిన వేగంతో కారు ఘోర రోడ్డు ప్రమాదానికి ఒక కుటుంబం ఇంటి యజమాని ని కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే కడప జిల్లా పులివెందుల వెంకటాపురం సమీపంలోని రింగ్ రోడ్ లో అతి వేగంగా కారు వచ్చి అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. దీంతో కారు నుజ్జు అయ్యింది. కారులో ప్రయాణిస్తున్న షరీఫ్ అక్కడిక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు హరికిషోర్ రెడ్డి, శివనరసింహారెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయి దీంతో వీరిని పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించి ఉన్నత స్థాయి వైద్యం కోసం కడప రిమ్స్కు తరలించారు.
మృతుడు విద్యుత్ శాఖలో యల్.డి.సి.గా విధులు నిర్వహిస్తున్న షరీఫ్ గా గుర్తించారు. మరో ఇద్దరు క్షతగాత్రులు కూడా పులివెందుల విద్యుత్ శాఖ లో విధులు నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. అతివేగమే వీరి ప్రాణాలు తీసింది అని స్థానికులు, బంధువులు అంటున్నారు. ప్రమాదం జరిగిన ఈ ప్రదేశంలో లో ఆయన కారును చూస్తేనే మీరు ఎంత వేగంగా ప్రైవేట్ చేస్తున్నారో అర్థమవుతుంది..