కడప జిల్లా వల్లూరు మండలం గంగన్నపల్లిలో నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో అపశ్రుతి జరిగింది. కూతకు వచ్చిన యువకుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోపే కన్నుమూశాడు.
కడప జిల్లా చెన్నూరు మండలం కొండపేటకు చెందిన నరేంద్ర ఎం.కామ్ చదివాడు. అతనికి కబడ్డీ అంటే చాలా ఇష్టం. గంగన్నపల్లిలో ప్రభుత్వ అధికారులు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించగా... నరేంద్ర వెళ్లాడు. ఆటలో కూతకు వెళ్లిన అతడిని... ప్రత్యర్థి జట్టు సభ్యులు ఒక్కసారిగా పట్టుకుని కింద పడేశారు. అనంతరం పైకి లేచిన యువకుడు... రెండు అడుగులు వేసిన వెంటనే కింద పడిపోయాడు. నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించి... ఒక వ్యక్తిని ఇచ్చి బాధితుడిని రిమ్స్‌కు పంపించారు. పరీక్షించిన వైద్యులు... అప్పటికే అతను చనిపోయినట్లు వెల్లడించారు.
పోటీలకు వెళ్తున్నా అమ్మ... తప్పకుండా గెలిచే వస్తా అని తన కొడుకు చెప్పిన మాటలే ఆఖరి మాటలయ్యాయని నరేంద్ర తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు.
ఇదీ చదవండి