ETV Bharat / state

లాక్​డౌన్​తో జీవనం సాగించలేక.. రోజువారీ కూలీ ఆత్మహత్య ! - అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య

కొవిడ్ తరుణంలో విధించిన లాక్​డౌన్​తో ఎన్నో పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రోజువారి జీవనం సాగక.. అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనే కడప జిల్లాలో జరిగింది. బతుకు బండిని నడిపించలేక ఓ రోజువారీ కూలి ఆత్మహత్య చేసుకున్నాడు.

అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య
అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య
author img

By

Published : Jun 18, 2021, 2:05 PM IST

కడప జిల్లా వల్లూరు మండలం గణేశ్​పురానికి చెందిన గఫూర్​కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. గఫూర్​ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే లాక్​డౌన్ కారణంతో ఉపాధి లేకపోవడంతో ఆర్థికంగా కుంగిపోయాడు. అప్పుల భారం అధికమవ్వడంతో భరించలేక ఇంట్లో ఫ్యాన్​కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గఫూర్ బంధువులు తెలిపారు.

అంతలోనే దారుణం

అల్లుడి ఆర్థిక పరిస్థితిని గమనించిన గఫూర్ అత్త.. తన కూతురిని రెండు రోజుల క్రితం పుట్టింటికి తీసుకెళ్లింది. ఇంతలోనే అతను ఈ దారుణానికి పాల్పడ్డాడని ఆ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గఫూర్​ ఆత్మహత్యతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజగోపాల్ తెలిపారు.

ఇదీ చదవండి..

Theft: వ్యాపారి ఇంట్లో రూ.40 లక్షలు విలువచేసే వజ్రాలు, జాతిరత్నాలు చోరీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.