ETV Bharat / state

Rape Case: మానసిక వికలాంగురాలిపై అత్యాచారం.. దగ్గరి బంధువే నిందితుడు!

దగ్గరి బంధువే... ఓ మానసిక వికలాంగురాలిపై అత్యాచారం చేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వచ్చి ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. విషయం గుర్తించిన స్థానికులు అతడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు.

A close relative raped a mentally handicapped women in kadapa
మానసిక వికలాంగురాలిపై అత్యాచారం
author img

By

Published : Dec 22, 2021, 9:08 AM IST

కడప జిల్లా కేంద్రంలో ఓ మానసిక వికలాంగురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడో దుర్మార్గుడు. విషయం గుర్తించిన స్థానికులు అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పట్టణంలోని రవీంద్ర నగర్​కు చెందిన 25 ఏళ్ల మానసిక వికలాంగురాలు.. ఆమె తల్లితో కలిసి జీవిస్తోంది. తల్లి పని నిమిత్తం బయటకు వెళ్లింది. విషయం గుర్తించిన దగ్గరి బంధువు షేక్ ఇమ్రాన్ యువతిపై కన్నేశాడు. దొంగచాటుగా ఇంట్లోకి చొరబడి యువతిపై అత్యాచారం చేశాడు.

తల్లి వచ్చేసరికి అతడు ఇంట్లోనే ఉండటంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. విషయం గుర్తించిన స్థానికులు షేక్ ఇమ్రాన్​ని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అభం శుభం తెలియని మానసిక వికలాంగురాలిని పాడు చేస్తావా అంటూ ఇష్టమొచ్చినట్లుగా కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అత్యాచారానికి గురైన మానసిక వికలాంగురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి:

GANJA SMUGGLING: అమెజాన్ ద్వారా గంజాయి స్మగ్లింగ్.. కోట్లలో బిజినెస్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.