కడప జిల్లా రాజంపేట-నందలూరు మండలాల్లో బీభత్సం సృష్టించిన వరదల్లో.. ఇప్పటివరకు 38 మంది గల్లంతయ్యారని( Persons missed by floods ) పోలీసులు తెలిపారు. రాజంపేట మండలం మందపల్లి, గుండ్లురు, పులపత్తూరు, తోగురుపేట గ్రామాల్లో 38 మంది వరదల్లో కొట్టుకుపోయినట్లు మన్నూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ భక్తవత్సలం తెలిపారు.
గల్లంతైనవారిలో ఇప్పటివరకు 25 మృతదేహాలను(dead bodies identified) గుర్తించి, వారి బంధువులకు అప్పగించినట్లు ఎస్సై వెల్లడించారు. ఇంకా 13 మంది ఆచూకీ లభ్యం కాలేదని తెలిపారు. వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
రాజంపేట మండలం తొగురుపేట-రామచంద్రాపురం మార్గమధ్యంలో వారం క్రితం వరదల్లో కొట్టుకుపోయిన ఈశ్వరమ్మ అనే మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. వారం రోజుల నుంచి ఈశ్వరమ్మ కోసం కుటుంబ సభ్యులు అనేక ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. ఇవాళ తాళ్ళపాక వద్ద మృతదేహాన్ని గుర్తించారు.
"పక్క ఊర్లో వరదలు వస్తున్నాయని చూస్తానికి మా అత్తగారు శుక్రవారం పోయారు. అప్పుడు నేను డాబా మీద ఉన్నాను. అక్కడికి వెళ్లిన ఆమె ఎంతకీ రాలేదు. భయం వేసి పక్క ఊర్లో, చెరువు దగ్గర ఎక్కడెక్కడే వెతికాం అయినా ఆమె కనిపించలేదు. ఈరోజు ఎవరో మృతదేహాన్ని గుర్తించారని తెలిసి పోలీసు స్టేషన్కు వెళ్లాం. బట్టలు, గాజులు చూసి ఆమె మా అత్తగారు అని గుర్తించాం" -ఈశ్వరమ్మ కోడలు
ఇదీ చదవండి : తెగిన మట్టికట్ట...గూడు పోయి గోడు మిగిలింది..