ETV Bharat / state

ప్రధానికి వైకాపా ఎంపీ మరో లేఖ: కేంద్ర కేబినెట్ నిర్ణయాలపై ప్రశంసలు - ప్రధాని మోదీకి ఎంపీ రఘరామకృష్ణరాజు లేఖ

నరసాపురం ఎంపీ రఘరామకృష్ణరాజు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. బుధవారం కేంద్ర కేబినేట్ తీసుకున్న నిర్ణయాలను ఆయన ప్రశంసించారు. ఈ నెలలో ప్రధానికి ఆయన లేఖ రాయటం ఇది రెండోసారి.

raghurama krishna raju letter to pm modi

author img

By

Published : Jul 9, 2020, 6:50 PM IST

Updated : Jul 9, 2020, 7:54 PM IST

ప్రధాని మోదీకి వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు. మోదీ నాయకత్వంలో కేంద్ర కేబినేట్ తీసుకున్న నిర్ణయాలపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. వ్యవసాయ రంగానికి లక్ష కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేయాలన్న నిర్ణయంపై కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు ఈ నిధి పెద్ద ఉపశమనమని అన్నారు.

అలాగే.. పీఎం ఆవాస్‌ యోజన ద్వారా వలస కూలీలకు అండగా నిలిచారని ఎంపీ రఘరామకృష్ణరాజు మోదీని ప్రశంసించారు. మరో పథకమైన పీఎం గరీబ్‌ కల్యాణ్‌ యోజన నవంబరు వరకు పొడిగించటం మంచి నిర్ణయమని లేఖలో పేర్కొన్నారు. దీని ద్వార 81 కోట్లమంది పేదల ఆకలి తీరుతుందని పేర్కొన్నారు. పేదలకు ఈ పథకాలు ప్రవేశపెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి:

ఎంపీ రఘురామకృష్ణమరాజుపై వైకాపా ఎమ్మెల్యేల ఫిర్యాదు

Last Updated : Jul 9, 2020, 7:54 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.