పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడులో ఈద్గా ప్రాంగణాన్ని స్థానిక ఎమ్మెల్యే తలారి వెంకటరావు ప్రారంభించారు. రంజాన్ వేడుకలు పురస్కరించుకుని ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. అన్ని వర్గాల ప్రజలతో పాటు మైనార్టీల అభివృద్ధికి వైకాపా ప్రభుత్వం పెద్దపీట వేసిందని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు.
ద్వారకాతిరుమలలో మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల, ఉర్దూ పాఠశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని తలారి వెంకట్రావు అన్నారు . దేవరపల్లి మండలం గౌరీపట్నంలో ఎస్సీ బాలుర గురుకుల పాఠశాల నిర్మాణానికి సుమారు రూ. 32 కోట్లు ,గోపాలపురంలో బిసి రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి రూ. 37 కోట్లు మంజూరైనట్లు తెలిపారు.
ఇదీ చూడండి