ఇన్నాళ్లూ గ్రామ వలంటీర్ల ఎంపిక తీరుపై.. విపక్షాల ఆరోపణలు విన్నాం. ఇప్పుడు.. ఆ జాబితాలోకి అధికార పార్టీకి చెందిన వారూ చేరిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం వైకాపా ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఇంటి ముందు.. యాదవోలు గ్రామానికి చెందిన సొంత పార్టీ నేతలే ఆందోళనకు దిగారు. అర్హత లేని వ్యక్తికి గ్రామ వలంటీరు పోస్టు దక్కిందని ఆరోపించారు. పురుగు మందు డబ్బాలు, పెట్రోలు సీసాలతో బైఠాయించి నిరసన తెలిపారు. అర్హుల పేర్లు ఎంపిక జాబితా నుంచి తీసివేశారని ఆరోపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారికి సర్ది చెప్పారు. వాలంటీర్ల ఎంపికపై తక్షణం చర్యలు తీసుకోవాలని... లేదంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని కార్యకర్తలు హెచ్చరించారు.
ఇవీ చూడండి-'గ్రూప్ 2, 3 పరీక్షా ఫలితాలు రద్దు చేయాలి'