భీమవరం అభివృద్ధిపై చర్చకు రావాలంటూ వైకాపా, జనసేన నాయకులు సవాళ్లు - ప్రతిసవాళ్లు చేసుకున్నారు. మున్సిపల్ ఆఫీస్ వద్దకు చర్చకు రావాలని వైకాపా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌కు జనసేన నేత గోవిందరావు సవాల్ విసిరారు. కాగా ఎమ్మెల్యే అనుచరులు మాత్రం మున్సిపల్ ఆఫీస్‌లో కాకుండా తాడేరు వద్దకు వచ్చి చర్చలో పాల్గొనాలని గోవిందరావుకు ప్రతి సవాల్ విసిరారు. ఉదయం 11 గంటలకు గోవిందరావు మున్సిపల్ కార్యాలయం వద్ద బైఠాయించగా... వైకాపా నేతలు తాడేరు వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండడం వల్ల పోలీసులు గోవిందరావును ఇంటికి తరలించారు. అనంతరం వివాదం సద్దుమణిగింది.
ఇదీ చదవండి: