స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు రెండు మూడు రోజుల్లో తీర్పు వెలువరించే అవకాశం ఉండటం వల్ల పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అధికారులతో సమావేశం నిర్వహించారు.
పశ్చిమగోదావరి జిల్లాలో 909 గ్రామ పంచాయతీలున్నాయి. టెంటు పంచాయతీ పోలవరం ప్రాజెక్టు పరిధిలోకి రావడం వల్ల నోటిఫైడ్ అయ్యాయి. ఆకివీడు పంచాయతీ నగర పంచాయతీగా మారింది. మరో 19 పంచాయతీలు ఆకివీడులో విలీనమయ్యాయి. కొత్తగా 12 గ్రామపంచాయతీ ఏర్పడ్డాయి. అన్నీ కలిపి 909 పంచాయతీలు... వాటి పరిధిలోని 9859 వార్డులలో ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బ్యాలెట్ పత్రాల ముద్రణ ప్రారంభమైంది. జిల్లాలో 60 లక్షలు అవసరం కాగా.. 24 లక్షల బ్యాలెట్ పత్రాలు ముద్రణ పూర్తయింది. జిల్లాలోని ఆరు ప్రింటింగ్ ప్రెస్లలో మిగిలిన బ్యాలెట్ పత్రాల ముద్రణ కొనసాగిస్తున్నారు. 10,500 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. జిల్లాలోని పదివేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 200 లోపు ఓటర్లకు 410, 201 నుంచి 400 లోపు ఓటర్లకు 510, 400కు పైగా ఓటర్లకు 800 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 200 లోపు ఉన్న పోలింగ్ కేంద్రాల్లో ఒక ప్రోసిడింగ్ అధికారి, ఒక పోలింగ్ అధికారి, 400 లోపు ఉన్న పోలింగ్ కేంద్రాల్లో ఒక ప్రోసిడింగ్ అధికారి, ఇద్దరు పోలింగ్ అధికారులు, 400 పైగా ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో ఒక ప్రొసిడింగ్ అధికారి, ముగ్గురు పోలింగ్ అధికారులు ఉండేలా నియమించనున్నారు. ఎన్నికల సంఘం నుంచి ఎప్పుడు ఆదేశాలు వచ్చినా ఎన్నికలు నిర్వహించడానికి తమ యంత్రాంగం సిద్ధంగా ఉందని పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఇదీ చదవండి :