పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో 7 ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో లాక్ డౌన్ విధించారు. అత్యధికంగా కేసులు నమోదైన ప్రాంతాలను ఎంపికచేసి ప్రజల రాకపోకలు నిషేధించారు. ఏలూరు నగరంలో ఒకటో పట్టణాన్ని పూర్తిగా లాక్ డౌన్ చేశారు. అక్కడ 216 కేసులు నమోదయ్యాయి. రహదారులను బారికేడ్లతో మూసివేశారు. వాణిజ్య దుకాణాలు, వ్యాపార సంస్థలు, కూరగాయల మార్కెట్లన్నీ మూసేశారు.
నరసాపురం, మొగల్తూరు, పెనుగొండ, పోడూరు ప్రాంతాల్లోనూ లాక్ డౌన్ విధించారు. జిల్లాలో గత 10 రోజుల నుంచి భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ 10 రోజుల్లో 400లకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 550కు చేరుకుంది. ఆదివారం 52 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇవీ చదవండి...