పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఉల్లిపాయల హోల్ సేల్ దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. పలు దుకాణాల్లో సరుకు నిల్వాల రికార్డులు నమోదు చేయటంలో అలసత్వం ప్రదర్శించటంతోపాటు, దుకాణ యాజమానులు అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. మార్కెట్ కమిటీకి సమర్పించాల్సిన అసెస్మెంట్లను సమర్పించలేదని అధికారులు తెలిపారు. తూకాలలో మోసాలకు పాల్పడుతుండటంతో కేసులు నమోదు చేశారు. మెుత్తం మూడు షాపుల్లో దాదాపు 25 లక్షల విలువైన ఉల్లిని అక్రమంగా నిల్వచేసినట్లు అధికారులు తెలిపారు.
ఇదీచదవండి