పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని ఓ చిల్డ్రన్ హోమ్‌లో ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు. మొగల్తూరు మండలం ముత్యాలపల్లి చెందిన బాలన్ కిట్టు, అత్తిలి మండలం పురానికి చెందిన ఉండ్రాజవరపు బాలు అనే విద్యార్థులు... ఈ నెల 13న హోమ్ నుంచి పాఠశాలకు వెళ్లి.... తిరిగి హోంకు చేరుకోలేదు. వార్డెన్ కె రామ్మోహన్ రావు ఈ విషయమై పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి