వయ్యేరు ప్రవాహ ఉధృతికి పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ వద్ద వరద ముంపు కొనసాగుతోంది. ఎగువన ఉన్న ఎర్ర కాలువ పొంగిపొర్లి ప్రవహిస్తుండడంతో అదనపు జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీరు నందమూరి ఆక్విడెక్టు ద్వారా వయ్యేరు కాలువను చేరటంతో దువ్వ వద్ద నీటి ఉద్ధృతి కొనసాగుతోంది.
దీంతో గ్రామంలోని ఇళ్లు గడిచిన వారం రోజులుగా నీటిలోనే ఉన్నాయి. నిర్వాసితులకు దువ్వ లోని వసతి గృహంలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. వీరిలో కొంత మంది దొంగల భయంతో గట్టుపై తాత్కాలిక ఆవాసం ఏర్పాటు చేసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ప్రవాహ వేగం మరో రెండు మూడు రోజులు కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: