పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం శివదేవునిచిక్కాలలో నిల్వ ఉంచిన తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సహాయక కమిషనర్ జయరాజు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యాన్ని తీసుకొచ్చి నిల్వ ఉంచారనే సమాచారం రావటంతో తనిఖీలు చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో సుమారు 2.48 లక్షల విలువైన 1048 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు వివరించారు. ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారనీ.. త్వరలో వారిని అరెస్టు చేస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: కరోనాతో కొవ్వూరు మార్కెట్ కమిటీ చైర్మన్ మృతి