పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం పాందువ్వ గ్రామంలో తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. గత నాలుగు ఆదివారాలుగా గ్రామంలోని 850 కుటుంబాలకు కూరగాయలు, నిత్యవసరాలు పంపిణీ చేస్తున్నారు. ఇవాళ దాతలు చింతలపాటి రాంబాబు సహకారంతో గ్రామంలోని ప్రతి కుటుంబానికి 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో పంచదార, కిలో మంచి నూనె, కిలో గోధుమ రవ్వ పంపిణీ చేశారు.
ఇదీ చదవండి : ఎక్కడి వారు అక్కడే ఉండండి: సీఎం జగన్