ETV Bharat / state

fake account: 'తప్పుడు పోస్టులు పెట్టినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి'

సామాజిక మాధ్యమాల్లో తనపై తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కోరారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు చేస్తున్న చింతమనేని
ఫిర్యాదు చేస్తున్న చింతమనేని
author img

By

Published : Jun 7, 2021, 6:24 PM IST

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరణించారంటూ కొందరు వ్యక్తులు(social media) సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. దీనిపై స్పందించిన చింతమనేని ప్రభాకర్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్​కు, అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన పేరు మీద ఫేస్ బుక్​లో నకిలీ ఖాతా సృష్టించి.. సంవత్సర కాలంగా అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని చింతమనేని ఫిర్యాదులో పేర్కొన్నారు. అసత్య పోస్టులు పెట్టి ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: ap corona cases: రాష్ట్రంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.