పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని మెడికల్ దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఒక దుకాణంలో కాలపరిమితి తీరిన మందులు నిల్వ ఉంచడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మందుల దుకాణంలో ఫార్మసిస్ట్ ఉండాల్సి ఉండగా.. స్వయంగా దుకాణం యజమానులే మందుల చీటీలు చూసి వినియోగదారులకు మందులను ఇస్తుండటాన్ని అధికారులు గుర్తించారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ ఎస్ఐ ఏసుబాబు, ఔషధ నియంత్రణ తనిఖీ అధికారి వీర కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండి: