ETV Bharat / state

సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏడుగురికి కరోనా - covid list in west goavari dst

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. సబ్ కలెక్టర్ కార్యాలయంలో తాజాగా ఏడుగురు కరోనా బారినపడ్డారు. 31 మందికి పరీక్షలు చేయగా ప్రస్తుతానికి 19 మంది ఫలితాలు వచ్చాయి. వీటిలో ఏడుగురికి పాజిటివ్ అని వైద్యులు నిర్థరించారు.

seven members tested corona positive in west godavari dst sub collector office

author img

By

Published : Jul 14, 2020, 8:05 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏడుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటీవల కార్యాలయంలో 31 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24 గంటల వ్యవధిలో వచ్చిన 19 మంది ఫలితాలలో ఏడుగురికి పాజిటివ్ నిర్ధరణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు.

వీరిలో నరసాపురానికి చెందిన వారు నలుగురు, పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన వారు ఇద్దరు, మొగల్తూరు మండలానికి చెందిన ఒక్కరు ఉన్నారు. మరో 12 మంది వైద్య పరీక్షల ఫలితాలు రావలసి ఉందన్నారు. చికిత్స కోసం వీరిని కొవిడ్ కేర్ కేంద్రానికి తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి

ఆవుతో ఎద్దు 'ప్రేమాయణం'.. కానీ...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.