పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలోని జాజులకుంట గ్రామంలో వివాదం నెలకొంది. గ్రామానికి చెందిన ఆల సత్యనారాయణ నాలుగు రోజుల క్రితం తనకు రావాల్సిన డబ్బులు అడిగేందుకు కంచర్ల నాగు అనే వ్యక్తి ఇంటికి వెళ్లాడు. తన బాకీ చెల్లించాలని గట్టిగా అడగటంతో నాగు.. సత్యనారాయణను కర్రతో బలంగా మోదాడు. తీవ్ర గాయాలపాలైన అతన్ని స్థానికులు ఏలూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సత్యనారాయణ ఇవాళ మృతి చెందాడు. దీనిపై మృతుని బంధువులు, గ్రామస్థులు నిందితుని ఇంటి ముందు ఆందోళనకు దిగారు. నాగును వెంటనే అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. దీనిపై ద్వారకాతిరుమల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: