పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. రెండున్నర నెలల వ్యవధిలో వంద లోపు ఉన్న కేసులు.. 18రోజుల్లోనే ఆరువందలకు చేరుకున్నాయి. పాజిటివ్ కేసులు విస్తరణతో రెడ్ జోన్ల సంఖ్య కూడా అధికమవుతోంది. ఇదిలా ఉండగా రెడ్జోన్లలో ఉండే వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించడం లేదు. నిత్యావసరాలు, తాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులు, కూలీ పనిచేసుకునే వారు పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కూరగాయలు, నిత్యావసరాలు తెచ్చుకోవడానికి పోలీసులు అనుమతించడం లేదని వాపోతున్నారు.
28 రోజుల వరకు ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదుకాకపోతే.. ఆ ప్రాంతాన్ని రెడ్‌జోన్ నుంచి మినహాయిస్తున్నారు. నెలరోజులుగా పదుల సంఖ్యలో కేసులు ఈ రెడ్ జోన్ ప్రాంతాలలోనే వెలుగుచూస్తున్నాయి. ఏలూరు, నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పెనుగొండ, పోడూరు, కొవ్వూరు, పెదపాడు, ఉండి ప్రాంతాల్లో రెడ్ జోన్లు అధికంగా ఉన్నాయి. జిల్లాలో నమోదైన కేసుల్లో కేవలం ఏలూరు లోనే 262పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఫలితంగా ఏలూరు నగరంలో పూర్తి లాక్డౌన్ విధించారు.
ఇదీచదవండి.