పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలంలో దారుణం జరిగింది. తొమ్మిది ఏళ్ల బాలికపై వరుసకు బావ అయ్యే వ్యక్తి పదిరోజుల క్రితం అత్యాచారం చేశాడు. అత్యాచార ఘటనపై పోలీసులకు బాధితురాలి కుటుంబం ఫిర్యాదు చేసింది. పోలీసులకు సమాచారం చేరడంతో ఆందోళనకు గురైన సత్యప్రకాశ్ శనివారం ఆత్మహత్యకు యత్నించాడు. ప్రైవేటు ఆస్పత్రిలో సత్యప్రకాశ్‌కు చికిత్స అందిస్తున్నారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: sucharitha : 'మీ పాలనలో మహిళలకు జరిగిన న్యాయమెంత?'