గోదారమ్మ వరదకు పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో వారం రోజులుగా పాత పోలవరం కడెమ్మ ఆలయం వద్ద రక్షణ గట్టు విరిగి గోదావరిలో పడిపోతోంది. ఎప్పుడేం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. గంట వ్యవధిలో రెండు సార్లు గట్టు గోదావరిలో విరిగి పడిపోయింది. అధికారులు ఇసుక బస్తాలు వేసి ఆపే ప్రయత్నం చేస్తున్నారు. గండి పడితే ఏమాత్రం గట్టు ఆగే అవకాశం లేదని ఆ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదం జరగకుండా ముందస్తు సహాయక శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
వరద గోదావరి.. రక్షణ గట్టును విరిచేస్తోంది - rain
పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. పాత పోలవరం కడెమ్మ ఆలయం వద్ద గోదావరి రక్షణ గట్టు అత్యంత ప్రమాదంగా ఉంది. రక్షణ గట్టు విరిగి గోదావరిలో పడుతోంది.
![వరద గోదావరి.. రక్షణ గట్టును విరిచేస్తోంది](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4103083-thumbnail-3x2-ff.jpg?imwidth=3840)
Protective_embankment_collapsed_with_godavari_floods
వరద గోదావరి..రక్షణ గట్టును విరిచేస్తోంది!
గోదారమ్మ వరదకు పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో వారం రోజులుగా పాత పోలవరం కడెమ్మ ఆలయం వద్ద రక్షణ గట్టు విరిగి గోదావరిలో పడిపోతోంది. ఎప్పుడేం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. గంట వ్యవధిలో రెండు సార్లు గట్టు గోదావరిలో విరిగి పడిపోయింది. అధికారులు ఇసుక బస్తాలు వేసి ఆపే ప్రయత్నం చేస్తున్నారు. గండి పడితే ఏమాత్రం గట్టు ఆగే అవకాశం లేదని ఆ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదం జరగకుండా ముందస్తు సహాయక శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
వరద గోదావరి..రక్షణ గట్టును విరిచేస్తోంది!
sample description