Police Raid Bethapudi Yuvagalam Camp Site: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్రను అడ్డుకునేందుకు ఓవైపు అధికార పాార్టీ శ్రేణులు అడుగడుగునా కవ్వింపు చర్యలకు పాల్పడుతుండగా.. మరోవైపు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం బేతపూడి యువగళం క్యాంప్ సైట్‌పై.. మంగళవారం అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు. మూడు వ్యాన్లలో యువగళం క్యాంప్ సైట్‌కి చేరుకున్న పోలీసులు.. మొత్తం 50మంది యువగళం వాలంటీర్లు, కిచెన్ సిబ్బంది, క్యాంప్ ఏర్పాటు చేసే సిబ్బందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన ఆ 50 మందిని ఏ స్టేషన్‌కు తీసుకెళ్లకుండా వాహనాల్లోనే గంటల తరబడి తిప్పడంపై తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం తీవ్రంగా ఆగ్రహిం వ్యక్తం చేసింది. చివరకు పోలీసులు బుధవారం రాత్రి వివిధ కోర్టుల్లో హాజరుపరిచారు. ఈ ఘటనలో 14 మంది నాయకులు, 38 మంది వాలంటీర్లపై మూడు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. చింతమనేని, తోట సీతారామలక్ష్మి సహా 14 మందిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. కొంతమందిని భీమవరం కోర్టులో హాజరుపరిచిన అనంతరం.. మళ్లీ పీఎస్‌కు తీసుకెళ్లి బలవంతంగా సంతకాలు తీసుకున్నారు. ఈ సందర్బంగా టీడీపీ నేతలు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర అడ్డుకోవడం వల్ల పోలీసులు, వారి మధ్య వాగ్వాదం జరిగింది.
Police Arrested 50 Yuvagalam Volunteers: టీడీపీ యువనేత లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అనుమతులిచ్చిన అధికారులు.. ఆంక్షలు, అటంకాలు, అడ్డంకులు సృష్టిస్తున్నారు. బేతపూడిలో లోకేశ్ పాదయాత్ర కోసం ఏర్పాటు చేసిన యువగళం క్యాంప్ సైట్‌పై అర్ధరాత్రి పోలీసుల దాడి చేశారు. మొత్తం మూడు వ్యాన్లలో యువగళం క్యాంప్ సైట్‌కి వచ్చిన పోలీసులు.. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా 50 మంది యువగళం వాలంటీర్లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ 50 మందిని ఏ స్టేషన్‌కు తరలించకుండా వాహనాల్లోనే.. కైకలూరు, కలిదిండి మార్గాల్లో రోడ్లపై తిప్పారు. ఆ తర్వాత సీసలిలోని ఐస్ ప్లాంట్‌లోకి వాలంటీర్లను తరలించారు. ఈ క్రమంలో పోలీసుల చర్యను నిరసిస్తూ.. కలిదిండి పోలీస్ స్టేషన్‌కి తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మరోవైపు గత రాత్రి నారా లోకేశ్ పాదయాత్రపై పక్కాగా కాపుకాచి వైఎస్సార్సీపీ నేతలు దాడి చేశారు. దాడిలో పోలీసులతో పాటు తెలుగుదేశం నేతలకు గాయాలయ్యాయి. ఈ ఘటనలోనే యువగళం వాలంటీర్లను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
Nara Lokesh 200 days Yuvagalam Padayatra: 200 రోజుల ప్రయాణం.. అడుగడుగునా వెల్లివిరిసిన అభిమానం
Achchennaidu Fire on Police Behavior: యువగళం పాదయాత్ర విషయంలో పోలీసుల వ్యవహరిస్తున్న తీరుపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఆగ్రహించారు. యువగళం వాలంటీర్ల అరెస్టు అప్రజాస్వామికమన్నారు. యువగళం శ్రేణులపై దాడి చేసి, అక్రమ కేసులు పెడతారా..? అని నిలదీశారు. యువగళానికి ప్రజల నుంచి వస్తోన్న స్పందన చూసి ఓర్వలేకే అధికార పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. లండన్ పర్యటనలో ఉన్నా జగన్‌కు.. యువగళమే గుర్తొస్తోందని ఎద్దేవా చేశారు. కొందరు పోలీసు అధికారులు వైసీపీ నేతలకు సహకరిస్తున్నారన్న అచ్చెన్నాయుడు.. రాజ్యాంగం కల్పించిన హక్కులకు విఘాతం కల్పిస్తున్నారని మండిపడ్డారు.
Yuvagalam Padayatra 200 Days Celebrations: ప్రజల గొంతుకగా యువగళం.. మిన్నంటిన '200 రోజుల' సంబురాలు
50 Volunteers Should be Released Immediately: పోలీసులు అదుపులోకి తీసుకున్న యువగళం కార్యకర్తలను ఉంగుటూరు ఎమ్మెల్యే వాసు బాబు అనుచరుల ఐస్ ఫ్యాక్టరీలోకి తరలించారని తెలుగుదేశం ఆరోపించింది. ఎమ్మెల్యే అనుచరుల ఐస్ ఫ్యాక్టరీలో తమ పార్టీ కార్యకర్తల్ని పోలీసులు బంధించారంటూ తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. అదుపులోకి తీసుకున్న యువగళం వాలంటీర్లపై సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసుల నమోదు చేస్తున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి.. ఆ 50 మంది వాలంటీర్లను వెంటనే విడుదల చేయాలని బంధువులు, కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.