ETV Bharat / state

పశ్చిమలో లెక్కింపు ఘట్టానికి రంగం సిద్ధం - కలెక్టర్ ప్రవీణ్ కుమార్

సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా అభ్యర్థుల భవితవ్యం ఎలా ఉండబోతోంది? ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్న ఓట్లు.. ఎవరిని గెలిపించబోతున్నాయి? ఏ పార్టీని ఓటర్లు ఆదరించబోతున్నారు? ఎవరికి ఎమ్మెల్యే యోగం అందించబోతున్నారు?  ఈ ప్రశ్నలన్నిటికీ మరి కొద్ది గంటల్లో సమాధానం లభించనుంది. ఓట్ల లెక్కింపుపైనే అందరి దృష్టి నెలకొంది.

లెక్కింపు ఘట్టానికి పశ్చిమలో రంగం సిద్ధం
author img

By

Published : May 22, 2019, 7:57 PM IST

లెక్కింపు ఘట్టానికి పశ్చిమలో రంగం సిద్ధం

నలభై రెండు రోజుల ఉత్కంఠకు తెరపడే సమయం దగ్గరపడింది. ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం తెలిసే ఘడియ వచ్చేసింది. పశ్చిమగోదావరి జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాటు పూర్తయ్యాయి. కౌంటింగ్​కు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.

మూడు కేంద్రాల్లో లెక్కింపు
ఓట్ల లెక్కింపునకు భీమవరం, ఏలూరులో మూడు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏలూరులోని రామచంద్ర ఇంజినీరింగ్ కళాశాలలో ఏలూరు పార్లమెంటు పరిధిలోని ఏలూరు, ఉంగుటూరు, దెందులూరు, పోలవరం, చింతలపూడి స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. రాజమండ్రి పార్లమెంటు పరిధిలోని నిడదవోలు, గోపాలపురం, కొవ్వూరు అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు ఏలూరులోని సి.ఆర్.రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. నరసాపురం పార్లమెంటు పరిధిలోని నరసాపురం, పాలకొల్లు, భీమవరం, ఆచంట, తాడేపల్లిగూడెం, తణుకు, ఉండి అసెంబ్లీ స్థానాలకు భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

కౌంటింగ్​కు మొత్తం 19 వందల మంది సిబ్బందిని ఉపయోగిస్తున్నట్లు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. గురువారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు, అనంతరం ఈవీఎంల ఓట్ల కౌంటింగ్ చేపట్టనున్నట్లు చెప్పారు.

పటిష్ఠ భద్రత
కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాసులు ఉన్న వ్యక్తులు మాత్రమే లోపలికి వెళ్లడానికి అనుమతి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ పికెటింగ్, పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ రవి ప్రకాశ్ తెలిపారు. సీఆర్​పీఎఫ్, ఏపీఎస్పీ, సివిల్ పోలీసులు మొత్తం రెండు వేల మంది కౌంటింగ్ భద్రతలో నిమగ్నమై ఉన్నట్లు ఎస్పీ చెప్పారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఆటంకాలు లేకుండా సజావుగా పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇవీ చూడండి : పశ్చిమ తీరం.. ఉత్కంఠ భరితం!

South Kolkata (West Bengal), May 19 (ANI): West Bengal Chief Minister Mamata Banerjee's nephew and Trinamool Congress (TMC) leader, Abhishek Banerjee cast his vote in West Bengal's South Kolkata today. He cast his vote at polling booth number 208 in South Kolkata parliamentary constituency. While speaking to media, Abhishek Banerjee said, "Whatever he (Prime Minister Narendra Modi) said in a meeting on May 15 in Diamond Harbour, he has to substantiate those statements with ample number of proofs and justify whatever he said. If he fails to do so, I will sue him in the criminal and defamation cases. I will drag him to the court and do the needful."

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.