ప్రభుత్వం అందించే పింఛను ఈ నెల చాలమంది లబ్ధిదారులకు రాలేదు. అనేక కారణాలతో వారికి పింఛను సొమ్మును అధికారులు ఆపేశారు. మందులు తెచ్చుకోవాలన్నా, నాలుగు మెతుకులు తినటానికి అంగట్లో సరుకులు కొనాలన్నా, పండగకు మనవళ్లకు పదో పరకో ఇవ్వాలన్నా, వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులకు ఆధారం ఆ పింఛను సొమ్మే. అలాంటిది అధికారులు కరెంట్ మీటర్ రీడింగ్ 300 యూనిట్లు వస్తుందని... 3 సెంట్లలో ఇల్లు ఉందని కారణాలు సాకుగా చూపి తమ పొట్ట కొట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పింఛను అందని బాధితులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ... తమకు పెన్షన్ ఇప్పించండని వాపోయారు.
ఇదీ చూడండి పెన్షన్ రావటం లేదని.. వికలాంగులు, వృద్ధుల ఆవేదన'