ఇంటింటికీ సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమం శనివారం మొదలయ్యింది. ఆయా గ్రామాల్లో సచివాలయ అధికారులు, గ్రామ వాలంటీర్లు, స్థానిక వైకాపా నాయకులు, కార్యకర్తలు పింఛన్ల పంపిణీకి చర్యలు చేపట్టారు. పలుచోట్ల వాలంటీర్ల బయోమెట్రిక్ పడకపోవడం వల్ల పంపిణీకి అంతరాయం కలిగింది. మరికొన్ని చోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తాయి. సామాజిక భద్రత పింఛన్లకి సంబంధించి వాలంటీర్ల చరవాణిలోకి వచ్చిన పేర్లు జాబితాలో లేకపోవడం వల్ల గందరగోళం నెలకొంది. అనంతరం అధికారులు వాటిని పరిశీలించి వారికి కూడా పింఛన్లు ఇవ్వాలని సూచించారు. పలు గ్రామాల్లో అర్హత ఉన్నప్పటికీ తమ పేర్లు లేవంటూ లబ్ధిదారులు సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. పెదవేగి మండలం వంగూరులో 26 మంది అర్హులకు పింఛన్లు రాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. దెందులూరులో వృద్ధులు తమకు పింఛన్లు రాలేదంటూ సచివాలయానికి పరుగులు తీశారు. అధికారులు మాత్రం జాబితాను పరిశీలించి పింఛను అందిస్తామని చెప్పారు.
పింఛన్ల పంపిణీలో సాంకేతిక సమస్యలు - పింఛన్ల పంపిణీలో సాంకేతిక సమస్యలు
పశ్చిమగోదావరి జిల్లాలో పింఛన్ల పంపిణీలో గందరగోళం నెలకొంది. సామాజిక భద్రత పింఛన్లకి సంబంధించి వాలంటీర్ల చరవాణి లోకి వచ్చిన పేర్లు జాబితాలో లేకపోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడ్డాయి. మరికొన్ని చోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తాయి. కొన్ని గ్రామాల్లో అర్హత ఉన్నప్పటికీ తమ పేర్లు లేవని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: