అకాల వర్షంతో పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలో సుమారు 1500 ఎకరాల్లో పంట నీట మునిగింది. కొవ్వలి దిగువ ప్రాంతంలో ఇటీవల రైతులు వరి పంట నూర్చి.. ధాన్యాన్ని పొలంలోనే బస్తాల్లో నిల్వ చేశారు. శనివారం రాత్రి ఒక్కసారిగా వచ్చిన గాలివానతో ధాన్యం బస్తాలన్నీ తడిసిపోయాయి. ప్రస్తుతం వెయ్యి ఎకరాల్లో ఎక్కడికక్కడ పొలాల్లో నీరు ఉండడంపై రైతులు ఆందోళనకు దురవుతున్నారు. ధాన్యాన్ని ఒడ్డుకు చేర్చడం కుదరక.. ఆరబెట్టడానికి వీలులేక ఆవేదన చెందుతున్నారు. చేతికందాల్సిన పంట చేజారిపోయిందని కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఇదీ చదవండి: