పశ్చిమగోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దెందులూరు మండలంలోని పలు గ్రామాల్లో వరినాట్లు నీట మునిగాయి. కొవ్వలి, దోసపాడు, పోతునూరు, జిల్లేడు దెబ్బ, వలకోడు ప్రాంతాల్లో వరి చేళ్లలోకి వర్షం నీరు చేరింది. ఎగువ నుంచి పెద్ద మొత్తంలో నీరు దిగువకు వస్తుంది. గ్రామాల్లోని వర్షపునీరు కొల్లేరులోకి పోవడానికి సరైన కాలువలు లేకపోవడంతో పంట పొలాలు నీట మునిగాయి. మొండికోడు, కొవ్వలి గ్రామాల్లోని కాలువల్లో నీటి ప్రవాహం మరింత పెరిగింది. ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మెట్ట ప్రాంతంలోని పెదవేగి, 11 మండలాల్లోనూ ఇదేవిధంగా వర్షం కురుస్తోంది.
ఇది కూడా చదవండి.