ETV Bharat / state

ఎత్తు పెరిగితే ముంపు పెరుగుతుందన్నది కామన్ సెన్స్‌: ఎన్జీటీ - national green tribunal latest news

పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యాం నిర్మాణం కారణంగా... ఇళ్లు కోల్పోయిన వారికి పునరావాస ప్రక్రియలో జాప్యం జరుగుతోందంటూ దాఖలైన వ్యాజ్యంపై... జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పోలవలం ప్రాజెక్టు అథారిటీ సహా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పర్యావరణ శాఖ తరఫు న్యాయవాదులపై... జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఎత్తు పెరిగితే ముంపు పెరుగుతుందన్నది కామన్ సెన్స్‌: ఎన్జీటీ
author img

By

Published : Nov 8, 2019, 7:23 AM IST

ఎత్తు పెరిగితే ముంపు పెరుగుతుందన్నది కామన్ సెన్స్‌: ఎన్జీటీ

పోలవరం టెండర్లు, గుత్తేదారులు ఎవరనే దానిపై తమకు ఆసక్తి లేదని... పరిహారం, పునరావాసం ఎంత మందికి ఇచ్చారో స్పష్టత ఇవ్వాలంటూ... పోలవలం ప్రాజెక్టు అథారిటీ సహా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పర్యావరణ శాఖ తరఫు న్యాయవాదులపై... జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యాం నిర్మాణం కారణంగా... ఇళ్లు కోల్పోయిన వారికి పునరావాస ప్రక్రియలో జాప్యం జరుగుతోందంటూ దాఖలైన వ్యాజ్యంపై... జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

గతంలో తాము సూచించిన విధంగా... విచారణకు సీఈవో హాజరయ్యారా అని ప్రశ్నించింది. ప్రాజెక్టు సభ్య కార్యదర్శి బీపీ పాండే హాజరయ్యారని న్యాయవాదులు బదులిచ్చారు. ప్రాజెక్టు ఎత్తు పెంపు పరిహారం, పునరావాసం విషయమై... ధర్మాసనం ప్రశ్నలకు పాండే సమాధానం ఇవ్వలేకపోయారు. క్షేత్రస్థాయిలో ఎస్​ఈ ఉంటారంటూ... న్యాయవాది ఏకే ప్రసాద్ ఇచ్చిన సమాధానంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. డ్యాం ఎత్తు పెరిగితే ముంపు పెరుగుతుందన్నది కామన్ సెన్స్‌ అని... క్షేత్రస్థాయిలో ఙ్ఞానం అవసరం లేదని... ఘాటుగా వ్యాఖ్యానించింది.

ఇదీ చదవండీ... ఎన్నికల నిర్వహణకు జాప్యం ఎందుకు..?

Intro:Body:

ap_hyd_del_02_07

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.