ETV Bharat / state

ఉంగుటూరు పోలీస్‌స్టేషన్‌కు బయలుదేరిన నారాలోకేశ్ - Nara Lokesh latest news

విజయవాడ నుంచి ఉంగుటూరు పోలీస్ స్టేషన్​కు నారా లోకేశ్‌ బయలుదేరారు. పోలీస్‌స్టేషన్‌లో ఉన్న ఎమ్మెల్యేలను కలిసేందుకు వెళ్లారు. మరోవైపు స్టేషన్ బెయిల్​పై సంతకం పెట్టేందుకు తెదేపా ఎమ్మెల్యేలు నిరాకరించారు.

Nara Lokesh
Nara Lokesh
author img

By

Published : Mar 23, 2022, 5:15 PM IST

ఉంగుటూరు పోలీసు స్టేషన్​లో ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలను పరామర్శించేందుకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెళ్లారు. మరోవైపు స్టేషన్ బెయిల్​పై సంతకం పెట్టేందుకు తెదేపా ఎమ్మెల్యేల నిరాకరించారు. అక్రమ అరెస్టులకు ఇచ్చే బెయిల్​పై సంతకం పెట్టబోమని, పీఎస్ వద్దే ఎమ్మెల్యేలు బైఠాయించారు. ఎక్సైజ్ కమిషనర్​కు వినతిపత్రం ఇవ్వటానికి వెళ్లటం నేరంగా ఎలా పరిగణిస్తారని నేతలు మండిపడ్డారు. ఏం తప్పు చేశామో పోలీసులు స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.

ఏం జరిగిందంటే?: ఎన్టీఆర్ భవన్ నుంచి ప్రత్యేక బస్సులో.. విజయవాడలోని ప్రసాదంపాడు ఎక్సైజ్‌ శాఖ ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి బయలుదేరిన తెలుగుదేశం ఎమ్మెల్యేలను.. ప్రసాదంపాడు వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. నాటుసారా మరణాలపై ఎక్సైజ్‌ కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న తెదేపా ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ క్రమంలో ప్రసాదంపాడు వద్ద పోలీసులు, తెదేపా ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం వారిని అరెస్టు చేసి.. ఉంగుటూరు, కంకిపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఇదీ చదవండి: ప్రసాదంపాడు ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద.. తెదేపా ఎమ్మెల్యేల అరెస్టు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.