ETV Bharat / state

వైకాపాలో ‘ఎంపీ’ కలకలం - ఎంపీ రఘురామకృష్ణరాజు తాజా

ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహార సరళిపై మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు మంగళవారం విరుచుకుపడ్డారు. అసెంబ్లీ వద్ద వారు విలేకర్లతో మాట్లాడారు. ఆయనకు అంత సీన్‌ లేదని ధ్వజమెత్తారు. వైకాపా నాయకుల విమర్శలపై రఘురామకృష్ణరాజు సైతం అదే స్థాయిలో స్పందించారు. మీరు రాజీనామాలు చేస్తే తానూ సిద్ధమేనని అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక వీడియో విడుదల చేశారు.

mp raghu
mp raghu
author img

By

Published : Jun 17, 2020, 6:21 AM IST

ఎంపీ నియోజకవర్గ పరిధి ఎమ్మెల్యేలకంటే ఆయనకు తక్కువ ఓట్లే వచ్చాయి. అలాంటిది ఆయన అక్కడి ఎమ్మెల్యేలను గెలిపించడమేంటి? ఎంపీ అంత గొప్ప వ్యక్తి అయితే సొంత పార్టీ పెట్టుకోవచ్చుగా? మమ్మల్ని గెలిపించిన జగన్‌ పట్ల ఎల్లప్పుడూ విశ్వాసంతో ఉంటాం. - మంత్రి పేర్ని నాని

రఘురామకృష్ణరాజు స్పందన: మనం ఒకసారి కలసినపుడు మీరేమన్నారో గుర్తుకు తెచ్చుకోండి నాని. సరే నా ఖర్మో.. మీ ఖర్మో నేను పార్టీలోకి వచ్చా. ఏ మూలనో మా రాజశేఖరరెడ్డి అబ్బాయి జగన్‌ అనే గౌరవంతో వీళ్లంతా కబురుపెడితే పెద్ద వాళ్లతోనే మాట్లాడా. గౌరవం ఇచ్చి పుచ్చుకోండి.

జగన్‌ అపాయింట్‌మెంట్‌ ఇప్పించండని బతిమిలాడారు. జగన్‌తో చెబితే ససేమిరా అన్నారు. ఆయన్ని మేమే ఒప్పించాం. - ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు

రఘురామకృష్ణరాజు: కారుమూరి నాగేశ్వరరావును బతిమిలాడానట. ఇళ్ల స్థలాల అక్రమాలలో ఆయనపై 60, 70 ఫిర్యాదులున్నాయి. వీరా మాట్లాడేది?

ఎంపీకి తన స్వగ్రామంలోనే తక్కువ ఓట్లొచ్చాయి. కులాల మధ్య చిచ్చుపెట్టే పనులు మానుకోవాలి.- మంత్రి శ్రీరంగనాథరాజు

రఘురామకృష్ణరాజు: అసలు నిందితుడు మంత్రి శ్రీరంగనాథరాజే. వాళ్ల ఊళ్లో చేసే అవినీతి అందరికీ తెలుసు.

గతంలోనే ఎంపీ వ్యవహార శైలి నచ్చక ప్రజలు బహిష్కరించారు. మూడు పార్టీలు మారిన ఆయన గురించి ప్రజలందరికీ తెలుసు.- ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌

రఘురామకృష్ణరాజు: సీఎం అపాయింటుమెంట్‌ దొరకట్లేదని బాధపడ్డఆయనకు ఏ హామీ దొరికిందో ఇలా మాట్లాడుతున్నారు.

సొంత ఎజెండాలు ఉంటే వేరేలా చూసుకోవాలి కానీ పార్టీని విమర్శించే హక్కు ఆయనకు లేదు. బ్యానర్‌ కట్టే క్యాడర్‌ కూడా ఆయనకు లేదు.- ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ

రఘురామకృష్ణంరాజు: కొట్టు సత్యనారాయణ ఇసుక అక్రమాల సూత్రధారి. నాకు బ్యానర్‌ కట్టే స్థాయి లేదంటున్నారు. ఎంతమందిని నా ఇంటి చుట్టూ కాపలాకు పంపారు?

సొంతంగా గెలిచే సత్తా ఉంటే రాజీనామా చేయాలి.-నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు

రఘురామకృష్ణరాజు: ప్రసాదరాజు ఎందుకు, ఎవరికోసం మాట్లాడారో ఆయన ముఖం చూస్తేనే తెలుస్తుంది.

మళ్లీ పోటీ చేసి గెలవాలి- జగన్‌ ఫొటోతో గెలవలేదని చెబుతున్న ఎంపీ రఘురామకృష్ణరాజు రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలిచి చూపించాలని వైకాపా ఉండి నియోజకవర్గ సమన్వయకర్త పీవీఎల్‌ నరసింహరాజు అన్నారు.

ఇదీ చదవండి: నెత్తురోడిన గాల్వన్​ లోయ.. ఇరువైపులా భారీ ప్రాణనష్టం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.