రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ చరిత్రలో నిలిచిపోతుందని మంత్రులు ధర్మాన కృష్ణదాస్, ఆళ్ల నాని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం చోదిమెళ్లలో 7వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను అందజేశారు.
ఇచ్చిన హామీలు అన్నింటినీ సీఎం జగన్ అమలు చేస్తున్నారని మంత్రి ధర్మాన కృష్ణదాస్ కొనియాడారు. ప్రజా సంక్షేమానికి పునాదులు వేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా 31లక్షల 75వేల 555 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. పట్టాలు ఇవ్వడమే కాక లబ్ధిదారులకు ఇళ్లూ నిర్మించి ఇస్తామని తెలిపారు.
ఇదీ చదవండి:
విశాఖ 'తూర్పు'న ఉద్రిక్తత.. సాయిబాబా గుడికి ఎమ్మెల్యే అమర్నాథ్