పశ్చిమగోదావరి జిల్లా తణుకులో.. మంత్రి ధర్మాన కృష్ణదాస్ పర్యటించారు. తణుకులో వివిధ ప్రభుత్వ కార్యాలయాల భవనాలు, శిథిలావస్థకు చేరిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. తణుకులో శిథిలావస్థకు చేరిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని మంత్రి ధర్మాన స్థానిక శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు తో కలిసి పరిశీలించారు.
భవనాలు శిథిలావస్థకు చేరటంతో.. కొత్తగా భవనాలు నిర్మించడానికి నిధులు మంజూరు చేయాలని స్థానిక ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు మంత్రిని కోరారు. ప్రధాన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు.. సజ్జాపురంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కూడా కలిపి ఒకే చోట నిర్మించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని మంత్రికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ఇదీ చదవండి:
ELURU RESULTS: పూర్తయిన ఓట్ల లెక్కింపు..ఎవరికి ఎన్ని దక్కాయంటే..