ETV Bharat / state

'మంత్రి గారూ... ఇన్​సైడ్ ట్రేడింగ్​ను రుజువు చేయండి'

వైకాపా అసమర్థ పాలనతో రాష్ట్రానికి పరిశ్రమలు రావడంలేదని... ఉన్న కొన్ని పరిశ్రమలు ఇప్పుడు బైబై ఆంధ్రప్రదేశ్ అంటున్నాయని... తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఏలూరులోని జిల్లా కర్మాగారంలో ఉన్న చింతమనేని ప్రభాకర్​ను లోకేశ్ పరామర్శించారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించేవారిపై అక్రమకేసులు పెట్టి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధానిలో ఇన్​సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించిన మంత్రి... ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు.

"మంత్రి గారూ... ఇన్​సైడ్ ట్రేడింగ్ ఆరోపణలు రుజువు చేయండి"
author img

By

Published : Oct 31, 2019, 7:24 PM IST

'మంత్రి గారూ... ఇన్​సైడ్ ట్రేడింగ్​ను రుజువు చేయండి'

వైకాపా తీరుతో పెట్టుబడులు రాక... ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయని తెదేపా ముఖ్యనేత నారా లోకేశ్ ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయన్న ఆయన... ఏపీని మరో బిహార్​లా మారుస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించే తెదేపా నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసుల పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని జిల్లా కారాగారంలో ఉన్న... దెందులూరు మాజీ ఎమ్యెల్యే చింతమనేని ప్రభాకర్​ను లోకేశ్ పరామర్శించారు. కేసులకు భయపడొద్దని... తెదేపా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.

5 నెలల్లో 610 కేసులు...
పెదవేగి మండలం దుగ్గిరాలలో చింతమనేని ఇంటికి వెళ్లిన లోకేశ్... ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం తెదేపా జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా తెదేపా కార్యాకర్తలు, నాయకులపై సుమారు 610 కేసులు పెట్టారని వివరించారు. కేసుల పేరుతో బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు. అమరావతిలో ఇన్​సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తున్న మంత్రి... నిరూపించాలని సవాల్ విసిరారు. సీఎం జగన్​కు మీడియా ముందుకు వచ్చే ధైర్యం లేదన్నారు. ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న సజ్జల రామకృష్ణరెడ్డి... అండతోనే తెదేపా నేతలపై పోలీసులు కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

lokesh tweet on media
లోకేశ్ ట్విట్

మీడియా గొంతు నొక్కుతారా..?
సీఎం జగన్ చేసేవన్నీ మంచి పనులే అయితే... జీవో 2430ను ఎందుకు తెచ్చారని లోకేశ్ నిలదీశారు. దొంగతనాలు, అవినీతిని కప్పిపుచ్చుకోడానికి మీడియా గొంతు నొక్కుతారా అని ప్రశ్నించారు. వైకాపా తప్పులను వెలుగులోకి తెస్తారనే భయంతో... ఈ జీవో తెచ్చారని ఆరోపించారు. తప్పులు చేస్తున్నా... వైకాపా భజన చేయాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ జీవోను వెంటనే రద్దు చేయకుంటే... తీవ్ర ప్రజావ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ఇదీ చదవండి : 'భయపడొద్దు.. మేమున్నాం' చింతమనేనికి లోకేశ్ భరోసా

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.